విద్య, వైద్య రంగాలను ప్రైవేపరం చేస్తున్నారు: మాజీ మంత్రి శైలజానాథ్ 1 y ago
AP: రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడమే సీఎం చంద్రబాబు నాయుడి విజన్ అని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. విద్య, వైద్య వ్యవస్థలను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ సర్కార్ ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చిందని, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లను నాశనం చేసి, వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. విద్య, వైద్యం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. యూజర్చార్జీలు పెట్టిన ఘనుడు ఆయననే మండిపడ్డారు.